
బిజెపి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి , టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య లు ఆదివారం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి, జరగబోయే ఎన్నికల్లో బిజెపికి సపోర్ట్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులు , ఉద్యోగ ఉపాధ్యాయులు నుండి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు అవకాశం ఇస్తే వాళ్లు ఏమి చేయలేదనే భావన పట్టబద్రుల్లో, టీచర్స్ లో ఉందన్నారు. అధికారంలో లేకపోయినా ఇక్కడ పట్టభద్రుల, విద్యారంగా , ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల కోసం కొట్లాడింది బిజెపి యే అన్నారు.అందుకే పట్టభద్రులు టీచర్స్ బిజెపి వైపు చూస్తున్నారన్నారు. పట్టభద్రులు టీచర్స్ బిజెపి పట్ల చూపుతున్న ఆదరణ విశ్వాసాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. పట్టభద్రులు, టీచర్స్ తమ మొదటి ప్రాధాన్యత ఓటును బిజెపికి వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, వైద రామానుజన్ , బండ రమణారెడ్డి, పాదం శివరాజ్, ఉప్పరపల్లి శ్రీనివాస్, రాగి సత్యనారాయణ , కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

