జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణుకుంట్ల శంకర్ మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా నాయకులు రామ్ చందర్ మాట్లాడుతూ, “మూడుదశాబ్దాల పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఎస్సీ వర్గీకరణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన వీరుల త్యాగాలు వృథా కాకుండా, ప్రతి సంవత్సరం మార్చి 1న ‘మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం’గా జరుపుకోవాలి” అని అన్నారు. అంతేకాక, “ఏబీసీడీ వర్గీకరణ అమరులకు అంకితం” అంటూ భావితరాలకు వీరి పోరాటం స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రేణుకుంట్ల సంపత్ మాదిగ, ఎంఎస్పి జిల్లా నాయకులు కన్నూరి సారయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అక్కల రాజయ్య మాదిగ, ఎంఎస్పి ప్రధాన కార్యదర్శి అంబాల సారయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల గౌరవ అధ్యక్షులు మచ్చ సారయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు అంబాల మధునయ్య మాదిగ, మచ్చ పైడి మాదిగ, మచ్చ సరోత్తమ్ మాదిగ, కోండ్ర సారయ్య మాదిగ, రేణిగుంట్ల బాబు మాదిగ, మచ్చ దేవరాజు మాదిగ, హరి శంకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ నాయకులు, యువత, గ్రామస్థులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.
