భూపాలపల్లి: టేకుమట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సట్ల రవి గౌడ్ కాంగ్రెస్ నేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “గతంలో బండి కూడా లేని నువ్వు ఇప్పుడు ఇన్నోవా ఎక్కడి నుంచి తెచ్చుకున్నావో ప్రజలకు తెలుసు” అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు
“మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పై నీ అసభ్య వ్యాఖ్యలు మాఫీ లేనివి. మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అని హెచ్చరించారు.
“గతంలో గండ్ర వెంకటరమణారెడ్డి తో బేరాలు చేసిన సంగతి మర్చిపోయావా? నిన్ను పార్టీలోకి రానీయకుండా అడ్డుకున్నది గుర్తుందా?” అని ప్రశ్నించారు.
“కాంగ్రెస్ నేతలు ఇసుక అక్రమ రవాణాతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది పేదల కోసం కాదు, MLA, కాంగ్రెస్ నాయకుల కోసం!” అని ఆరోపించారు.
“స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేని చేతగాని కాంగ్రెస్ ను ప్రజలు త్వరలోనే ఓటుతో గుణపాఠం చెబుతారు” అని వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకునూరు తిరుపతి, మాజీ ఎంపీటీసీలు ఆది సునీత రఘు, పింగిలి వెంకటేశ్వర్ రెడ్డి, పోతనవెం ఐలయ్య, బందుల నరేష్, మాజీ సర్పంచులు ఉద్దమారి మహేష్ యాదవ్, పొన్నం చంద్రయ్య, నేరెళ్ల రామకృష్ణ, నిమ్మల స్వామి, గువ్వాడి లక్ష్మణ్, ఎండి అఫ్జల్, వర్దాచారి, ఎండి అక్రమ్ రెడ్డి రాజుల రాజు, బోనాల సతీష్, గొల్లపల్లి రఘు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
