
జమ్మికుంట, మే 14(zindagi9news):జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో మే 13 అర్ధరాత్రి అనుమానాస్పద ఘటన జరిగింది. బండారి సమ్మయ్య (వయసు 62) ఫిర్యాదు మేరకు, వర్షం సమయంలో బర్రెలకు గడ్డి వేస్తూ ఉండగా, గుర్తు తెలియని ఆరు మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి ఇంటిలోకి చొరబడ్డారు. “ఎవరు?” అని అడగగానే వారు పారిపోయారు. వారిలో ఒకరిని ‘రాజు’ అనే వ్యక్తిగా గుర్తించారని తెలిపారు. ఈయన నాలుగు నెలల క్రితం ఇంట్లో ఎలక్ట్రికల్ పనికి వచ్చిన వ్యక్తిగా గుర్తింపు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
