
మహాశివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా కోలాటం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా ప్యాపిలీ మండలం ఊటకొండ గ్రామంలో భక్తి, ఉత్సాహ వాతావరణంలో కోలాటం కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన బయపల్లె జై శ్రీను ఆధ్వర్యంలో ఈ సాంప్రదాయ కోలాటం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని శివనామ స్మరణలతో కోలాటం ఆడారు. సంప్రదాయ వాద్యాల నడుమ గ్రామ వీధులు భక్తి సంగీతంతో మార్మోగాయి. చిన్నారులు కూడా సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలకు మరింత శోభను చేకూర్చారు.
