హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం ఎ.రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ, ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వానం అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో భేటీ అయిన వీరు, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకూ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరణ:
భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి ఆవిష్కరించారు.
భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సమీక్ష:
✔️ ఆలయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, నిధుల అంశాలపై అధికారులను సీఎం సమీక్షించారు.
✔️ భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరగా అందించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
