
బైక్ స్కిడ్ అయి లారీ కింద పడి వ్యక్తి మృతి
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా వాహనం స్కిడ్ కావడంతో అదుపుతప్పి లారీ కింద పడిపోయాడు. ఈ ఘటనలో శాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామానికి చెందిన కానూరు రాజు (30) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
