
పెబ్బేరు పట్టణ ఓటర్ల జాబితాలో అవకతవకలు – మున్సిపల్ కమిషనర్‌కు వినతి
పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పెబ్బేరు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
వివిధ వార్డులకు చెందిన ఓటర్లను వారి అనుమతి లేకుండానే ఇతర వార్డుల్లో చేర్చి, అధికార పార్టీ ప్రతినిధులు ఇష్టానుసారంగా ఓటర్ల జాబితాను మార్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గతంలో ఉన్న స్థానాల్లోనే ఓటర్లు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్లను గందరగోళానికి గురి చేయకుండా జాగ్రత్తలు పాటించాలని వారు కోరారు.
అలాగే, నూతనంగా 18 సంవత్సరాలు నిండిన యువతి–యువకులకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, ఓటర్ల హక్కులు కాపాడేలా పారదర్శకంగా సవరణలు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
