కరీంనగర్, మార్చి 23: కరీంనగర్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ సభలో అపశృతి చోటు చేసుకుంది. సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించగా, ఈ ర్యాలీలో కరీంనగర్ కోతి రాంపూర్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు బుల్లెట్ బైక్ తో ప్రమాదకరంగా ర్యాలీ చేశాడు.
బైకును అధిక వేగంతో రేస్ చేస్తూ జనంపైకి దూసుకెళ్లిన అతను, అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పద్మజపై బైక్ ఎక్కించాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో పాటు ఆమె కాలు విరిగింది.
సంఘటన స్థలంలోనే ఉన్న పోలీసు సిబ్బంది శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని, బుల్లెట్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గాయపడిన కానిస్టేబుల్ పద్మజను వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు చర్యలు చేపట్టారు.
– Zindagi9News
