పెబ్బేరు పట్టణ కేంద్రంలోని సుభాష్ చౌరస్తాలో సోమవారం రోజున వరంగల్లో ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్లీనరీ రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించిన గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఈ. దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, గొర్రెల కాపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, మార్కెట్ డైరెక్టర్ విజయ్ నాయుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నందిమల్ల అశోక్, పెబ్బేరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్, మాజీ వైస్ చైర్మన్ మేకల కర్రే స్వామి, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ విశ్వరూపం, మండల అధ్యక్షులు వనం రాముల యాదవ్, పెద్దింటి వెంకటేష్, చిన్న ఎల్లారెడ్డి, సుమతి, గోపి బాబు, ఎం.డి. మజీద్, సంతోష్ కుమార్ నాయుడు, సొప్పరి బీచ్ పల్లి గోవర్ధన్ రెడ్డి, మేకల ఎల్లయ్య, సంబురాము, వేణు, నరేష్, రఘు, రమేష్ గౌడ్, గణేష్, ధ్యారంగుల శీను, సి. బీముడు, కురుమూర్తి, సికే రాము, వడ్డే రమేష్, మాజీ సర్పంచ్ జనంపల్లి రామచంద్రారెడ్డి, మోహన్ దాసు, కిరణ్ కుమార్, బుచ్చన్న, మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
