పెబ్బేరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వనం రాములు యాదవ్ ఆధ్వర్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పెబ్బేరు ఎస్ఐ యుగేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండల సీనియర్ బిఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, ఎస్ఐ యుగేందర్ రెడ్డి కృషితో మండలంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
