పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి
పి డి ఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ డిమాండ్
కరీంనగర్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ హాజరై మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యపు వైఖరి ప్రదర్శిస్తుందని, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు.లేనియెడల మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
