
కోల్డ్రిఫ్ సిరప్ వాడకాన్ని వెంటనే ఆపండి – తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 6 (జిందగీ9న్యూస్):
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చిన్నారుల మరణాలకు కారణమైనట్లు అనుమానిస్తున్న కోల్డ్రిఫ్ సిరప్ (Coldrif Syrup) పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అప్రమత్తత సూచించింది.
డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, Batch No. SR-13కి చెందిన ఈ సిరప్‌లో Diethylene Glycol (DEG) అనే విషపదార్థం కలిసినట్లు తేలింది. ఈ సిరప్ వల్ల పిల్లల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరణాలు సంభవించినట్లు సమాచారం.
Coldrif Syrup (Paracetamol, Phenylephrine Hydrochloride, Chlorpheniramine Maleate Syrup) ను తమిళనాడులోని Sresan Pharma, Kancheepuram జిల్లాలో తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. మే 2025లో తయారైన ఈ సిరప్ ఏప్రిల్ 2027 వరకు చెల్లుబాటు అవుతుంది.
ప్రజలు తమ వద్ద ఉన్న Coldrif Syrup, Batch No. SR-13 వాడకాన్ని తక్షణమే ఆపి, సమీపంలోని డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు అప్పగించాలని సూచించారు. అలాగే ఈ ఉత్పత్తి తమ వద్ద ఉన్నట్లు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 (ఉ. 10:30 నుంచి సా. 5:00 వరకు) కు కాల్ చేయవచ్చు.
డీసీఏ అధికారులు తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి పనిచేస్తూ, ఈ సిరప్ పంపిణీని నిలిపివేయడానికి చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలోని ఫార్మసీలు, హోల్‌సేలర్లు, ఆసుపత్రులు తమ వద్ద ఉన్న ఈ బ్యాచ్ సిరప్‌ను వెంటనే నిల్వలో ఉంచి విక్రయించకుండా చూడాలని ఆదేశించారు.
“ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ సిరప్ వాడకం ప్రమాదకరం,” అని డీసీఏ డైరెక్టర్ జనరల్ షహ్నవాజ్ ఖాసీమ్, IPS హెచ్చరించారు.
– జిందగీ9న్యూస్
