హనుమకొండ | ఫిబ్రవరి 28 : వరంగల్ కమిషనరేట్ పరిధిలో సంవత్సరాల పాటు ప్రజాసేవలో నిమగ్నమై, ఇటీవల పదవీవిరమణ పొందిన పోలీస్ అధికారులు ఏసీపీ భోజరాజు, ఎస్ఐలు సాధిక్ అలీ, రవీందర్, మధు బాబు లను శుక్రవారం ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (ఐపీఎస్) పాల్గొని, పదవీవిరమణ పొందిన పోలీసు అధికారులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మీ సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శప్రాయమైనవి. పదవీవిరమణ తర్వాత కూడా మీ గౌరవం ఎప్పటికీ తగ్గదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. కాబట్టి, నిత్యం కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి” అని సూచించారు.
సన్మాన కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సురేష్ కుమార్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, సత్యనారాయణ, ఆర్ఐలు సతీష్, శ్రీనివాస్, స్పర్జన్ రాజ్, ఆర్ఎస్ఐ శ్రవణ్ పాల్గొన్నారు. పదవీవిరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో హర్షాతిరేకంగా పాల్గొన్నారు.
