మానకొండూర్ నియోజకవర్గంలోని అలుగునూర్ శ్రీ లక్ష్మీ నరసింహ కన్వెన్షన్ లో శనివారం రోజున పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వూట్కురి (ఆల్ఫోర్స్) నరేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధించేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో పలువురు పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
