రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, వెల్జీపూర్ గ్రామానికి చెందిన లలిత-భూపాల్ రెడ్డి కుమార్తె శాన్విక రెడ్డి (అర్చన) వివాహానికి బేంద్రం తిరుపతిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹10,000 విలువైన టేక్ మంచాలు అందజేయడం జరిగింది.
ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ, ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబాల కుమార్తెల వివాహాలకు సహాయం అందించడమే తమ సంకల్పం అని తెలిపారు. గ్రామ యువకులు, సేవా ప్రతినిధులు తమ వద్దకు సమాచారం అందించవచ్చని సూచించారు.
ఈ శుభకార్యక్రమంలో ఫౌండేషన్ సేవా ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో బుట్టి రామచంద్రం, చిట్టాల శ్రీనివాస్, బొజ్జ శ్రీనివాస్, చిలువేరి స్వామీ రెడ్డి, బొల్లారం నాగరాజు, మాందాటి బల్ రెడ్డి, గజ్జల శ్రీనివాస్, చుక్క రమేష్, వర్కోలు ప్రశాంత్, డాన్, శ్రీనివాస్ తదితరులు హాజరై తమ మద్దతు ప్రకటించారు.
– Zindagi9News
