ఉద్యోగ , ఉపాధ్యాయల వ్యతిరేక ప్రభుత్వాలుగా బి ఆర్ ఎస్, కాంగ్రెస్ లు..
జీతాలు తప్ప ఏ సౌకర్యాలు పొందలేని స్థితిలో ఉద్యోగ ఉపాధ్యా యులు….
ఎమ్మెల్సీ బి ఆర్ ఎస్, కాంగ్రెస్ లకు అవకాశం ఇచ్చారు.. ఒక్కసారి బీజేపీ కి అవకాశం ఇవ్వండి…
కరీంనగర్ ఫిబ్రవరి 6 : కరీంనగర్, ఆదిలాబాద్ , నిజామాబాద్ , మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి మల్క కొంరయ్య గురువారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి , జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొంరయ్య మాట్లాడుతూ గత బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వాలుగా మారాయన్నారు . ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో రెండు ఎకరాల ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు కేవలం జీతాలు పొందుతున్నారే తప్ప ఏ సౌకర్యాలు పొందడం లేదన్నారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చెందుతున్న ఉపాధ్యాయులకు పెన్షన్, గ్రాట్యూటి, జిపిఎఫ్, సరెండర్ లీవ్ డబ్బులు, పిఆర్ సి ఇచ్చే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. బి ఆర్ఎస్ , కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఏనాదు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల కోసం కొట్లాడింది లేదు, శాసనమండలిలో మాట్లాడింది లేదన్నారు. ఆ రెండు పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చినందున జరగబోయే ఎన్నికల్లోబిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుక నవుతానన్నారు. అనంతరం కరీంనగర్లోని ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయంలో బిజెపి ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ బిజెపి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, శాంతి కుమార్ , జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి లు మాట్లాడారు. జరగబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాల పై తగిన సూచనలు చేస్తూ, దిశానిర్దేశం చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంత రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నిజామా బాద్ జిల్లా మాజీ అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శితాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాంపల్లి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి , దండు కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
