పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున పెద్దపల్లి బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన దీక్షా దివస్ను పురస్కరించుకొని కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, అనంతరం అమర వీరుల స్థూపం వద్ద అమరులను స్మరిస్తూ అమరులకు ఘన నివాళులు అర్పించి, దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ , మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి , పుట్ట మధుకర్ , మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్, పార్టీ అధ్యక్షులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
