మంత్రి కొండ సురేఖను కలిసిన ప్రణవ్
త్వరలోనే ఇళ్ళందకుంట ఆలయ కమిటీ ఏర్పాటు
హుజురాబాద్ దేవాలయాల సమస్యలపై వినతి పత్రం అందజేత
రాములోరి కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు
హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి సంబంధించి అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను హైదరాబాద్లోని ఆమె నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా, ఇళ్ళందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన కమిటీ త్వరలోనే ఏర్పాటు చేయాలని ప్రణవ్ మంత్రి సురేఖకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని మంత్రి కొండ సురేఖ హామీ ఇచ్చినట్లు ప్రణవ్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.
Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
