టేకుమట్ల, మార్చి 8 (Zindagi9News):
టేకుమట్ల మండలంలోని సుబ్బక్కపల్లి గ్రామంలో ఆర్ఎంపి & పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి గొల్లెపేల్లి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 100 మంది రోగులకు పరీక్షలు నిర్వహించగా, 40 మంది రోగులకు కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వారికీ హైదరాబాద్ పుష్పగిరి కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు అందించనున్నట్లు లయన్స్ క్లబ్ జనరల్ సెక్రటరీ అప్తాలామిక్ గుంటోజు వెంకన్న తెలిపారు.
గ్రామ ప్రజల అభ్యర్థన:
ఈ విధంగా ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రతి సంవత్సరం నిర్వహించాలని గ్రామ ప్రజలు కోరారు. అనంతరం వారు గొల్లెపేల్లి సంతోష్ గౌడ్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
— Zindagi9News 📰
