తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో భారీగా ఉద్యోగాలు
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రి సీతక్క సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు.
భర్తీ కానున్న పోస్టులు:
➡ అంగన్వాడీ టీచర్లు – 6,399
➡ అంగన్వాడీ హెల్పర్లు – 7,837
ఇక ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అంగన్వాడీ ఉద్యోగాలకు ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.
