
టీఎస్ఆర్టీసీ దసరా లక్కీ డ్రా – 33 మందికి రూ.5.50 లక్షల బహుమతులు
హైదరాబాద్ (జిందగీ9న్యూస్):
దసరా పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక లక్కీ డ్రా ప్రకటించింది. ఈ డ్రాలో రాష్ట్రంలోని 11 రీజియన్లలో ముగ్గురు చొప్పున మొత్తం 33 మందిని ఎంపిక చేసి, రూ.5.50 లక్షల విలువైన నగదు బహుమతులు అందజేయనుంది.
ప్రతి రీజియన్ నుంచి ప్రథమ బహుమతిగా రూ.25 వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేల రూపాయలు, తృతీయ బహుమతిగా రూ.10 వేల రూపాయలను ప్రకటించారు.
అర్హత & విధానం
🔹కాలం: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు ప్రయాణించినవారే అర్హులు.
🔹బస్సులు: సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సులు.
🔸ప్రయాణికులు టికెట్‌పై పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్‌స్టాండ్‌లో ఏర్పాటు చేసిన డ్రాప్‌బాక్స్‌లో వేయాలి.
🔸ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నవారికి కూడా అర్హత ఉంటుంది.
డ్రా తేదీ & బహుమతులు
అక్టోబర్ 8న ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నగదు బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించనున్నారు.
ప్రత్యేక బస్సులు
దసరా సందర్భంగా సొంతూర్లకు వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తకుండా 7,754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు నడపాలని అధికారులు ఆదేశించారని చెప్పారు.
లక్కీ డ్రా వివరాలకు కాల్‌సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లేదా స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించవచ్చు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
