
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ఏన్కూర్ కాంగ్రెస్ నాయకుల దూకుడు
జిందగీ9న్యూస్, అక్టోబర్ 23 (వైరా నియోజకవర్గ రిపోర్టర్: రాము నాయక్)
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి బలంగా మద్దతు తెలుపుతూ ఏన్కూరు మండల కాంగ్రెస్ నాయకులు ప్రచార రంగంలో దూసుకెళ్తున్నారు.
మంత్రి సీతక్క, నాయకుడు మువ్వ విజయ్ బాబు సమక్షంలో ఏన్కూరు మండల కాంగ్రెస్ నాయకులు నవీన్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలసి, పూర్తి మద్దతు ప్రకటించారు. అనంతరం జూబ్లీహిల్స్ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు.
ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించి నవీన్ యాదవ్ విజయానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నరేష్ జాదవ్, తాళ్లూరి నవీన్, మొగిలి నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఏన్కూరు కాంగ్రెస్ నాయకులు నవీన్ యాదవ్ విజయానికి సమష్టిగా కృషి చేస్తూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు.
