
జమ్మికుంట పట్టణంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం డాక్టర్ వరుణ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థినుల ఆరోగ్యపరీక్షలు నిర్వహించి, చిన్నచిన్న వ్యాధులతో ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వరుణ బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడువాపు, టైఫాయిడ్, జాండిస్ వంటి సీజనల్ వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు.
బయట ఆహారం తినడం, శుద్ధి చేయని నీరు తాగడం వంటి అలవాట్లు మానుకోవాలని, కాచిన చల్లారిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ హేమలత, డాక్టర్ మహోన్నత పటేల్, సూపర్వైజర్ అరుణ, ఏఎన్ఎం రజిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
