
జమ్మికుంట, జూన్ 26: మున్సిపాలిటీ నిర్వహించిన 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు చెత్తతో తయారుచేసిన వినూత్న వస్తువులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ పాల్గొని మాట్లాడారు. చెత్తను తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, రీసైకిల్ చేయడం ద్వారా మార్పు సాధ్యమని పేర్కొన్నారు. 45 మంది విద్యార్థులు పాల్గొనగా, ముగ్గురికి బ్యాగులు, మిగిలిన వారికి పెన్నులు బహూకరించారు. పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న చెత్త ప్రాంతాన్ని శుభ్రపరిచి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్‌గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



