
పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
• చాణక్య పాఠశాలలో విద్యార్థుల
ఆత్మీయ కలయిక
• 32 సంవత్సరాల మహా ప్రస్థానంలో….
• ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీసర్లుగా స్థిరపడిన పూర్వ విద్యార్థులు
• చాణక్య పాఠశాల కరెస్పాండెంట్ ఆడెపు రవీందర్ వ్యాఖ్యలు
• పదోతరగతి విద్యార్థులు పరీక్షలో
ప్రతిభ కనబరిచాలి
• భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలని విద్యార్థులకు సూచనలు

మానకొండూరు:మానకొండూరు మండల కేంద్రంలోని చాణక్య ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం భావోద్వేగాల మధ్య జరిగింది. పది సంవత్సరాల పాఠశాల జీవితంలో ఏర్పడిన స్నేహాలు, గురువుల బోధనలు గుర్తు చేసుకుంటూ విద్యార్థులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. గురువుల పాదాలకు నమస్కరిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఆడెపు రవీందర్ మాట్లాడుతూ, 32 సంవత్సరాల చాణక్య పాఠశాల ప్రస్థానంలో ఇప్పటివరకు 32 పదోతరగతి బ్యాచ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాల్లో బ్యాంకు మేనేజర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీస్ అధికారులు, ఎస్సైలుగా వివిధ శాఖల్లో సేవలందిస్తున్నారని గర్వంగా చెప్పారు.
పదోతరగతి విద్యార్థులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని, జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలంటే క్రమశిక్షణతో పాటు మానవ విలువలు అవసరమని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
