
చల్లూరులో పంచాయతీ కార్యదర్శి 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్ పట్టుబాటు
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంబం నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.
ఫిర్యాదుదారుడు తన కొత్తగా నిర్మించుకున్న గృహానికి ఇంటి నంబర్ కేటాయించేందుకు అధికారికంగా సహాయం చేస్తానని చెబుతూ, రూ.20,000/- లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరిన్ని విచారణలు చేపడుతున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
