
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద పెళ్లి బస్సు లారీని ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మల్లేష్, సందీప్, బాలమణి, హేమలత అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
