పెబ్బేర్: బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో టౌన్ బీజేపీ అధ్యక్షుడు క్రాంతి కుమార్ నాయుడు మాట్లాడుతూ, దేశంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా బీజేపీ ఎదిగిందన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుందని, పెద్ద నోట్ల రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, వక్స్ బోర్డు చట్ట సవరణ వంటి కీలక కార్యక్రమాలు అమలు చేసినందున భారతదేశం విశ్వగురుగా నిలుస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గౌని వేమారెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ రంగస్వామి గౌడ్, నాయకులు నరసింహ నాయుడు, చింతల రామకృష్ణ, టౌన్ మాజీ అధ్యక్షుడు కంచ ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు దిలీప్ రెడ్డి, బలిజ శివ, అరుణ్ కుమార్, రాకేష్ గౌడ్, కుర్వ శ్రీకాంత్, సాయి, మోతే రఘు, గంధం శివ, కటికే నర్సోజి, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
