

జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం – కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పాలకవర్గం
జమ్మికుంట మున్సిపాలిటీలో KTR నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి చైర్మన్, ఉప చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడం పట్టణ ప్రజలు అభివృద్ధిపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గం మర్యాదపూర్వకంగా కేటీఆర్‌ను కలసి అభినందనలు తెలియజేసింది.పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో నూతన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), ఉప చైర్మన్ ముంతాజ్ అలీ (జావేద్), కౌన్సిలర్ ఫిరోజ్ ఖాన్ కలిసి కేటీఆర్‌ను భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.జమ్మికుంటను రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఆధునిక రహదారులు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, పట్టణ సౌందర్యీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ — ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధికి అనుకూలమని, జమ్మికుంటలో వేగంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి వర్గానికీ న్యాయం చేసే విధంగా పాలన అందిస్తామని తెలిపారు.బీఆర్ఎస్ నాయకత్వం మార్గదర్శకత్వంలో జమ్మికుంటలో అభివృద్ధి నూతన దశ ప్రారంభమైందని నూతన చైర్మన్, ఉప చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు.
