టేకుమట్ల, జనవరి 28:పీడిత ప్రజల విముక్తి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప పోరాట యోధుడు గద్దర్..కనీస ఇంకిత జ్ఞానం లేని నీలాంటి అజ్ఞానికి ఓటు వేయడం కరీంనగర్ ప్రజల దౌర్భాగ్యం
తెలంగాణ ఉద్యమంలో తన మాట పాట ఆటతో యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసిన యుద్ధనౌక గద్దర్ అని కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు…
ప్రజా యుద్ధనౌక గద్దర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి… లేకుంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు.బండి సంజయ్ తాను కేంద్రం మంత్రిని అనే విచక్షణ మరిచి గల్లి స్థాయి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు ఆయన అన్నారు
తెలంగాణ భావజాలం,తెలంగాణ అస్తిత్వం,పేదల పక్షాన పోరాడిన పోరాటయోధుల పై బిజెపికి ఎంత ద్వేషముందో మీ మాటలను బట్టి అర్థమవుతుంది..
నీ వ్యాఖ్యలను బట్టి చూస్తే భవిష్యత్తులో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్,బిజెపి భావజాలం ఉన్నవారికే ఏ ప్రతిభ పురస్కారాలు అయినా ఇస్తాం… ఎలాంటి అవినీతికి పాల్పడినా వాషింగ్ పౌడర్ నిర్మా సర్టిఫికెట్ ఇస్తాం అనే లాగా ఉన్నాయి.కనీస జ్ఞానం లేని నీలాంటి అజ్ఞానికి కరీంనగర్ బిడ్డలు ఓటు వేయడం, దరిద్రం కొద్దీ నీకు మంత్రి పదవి ఇవ్వడం తెలంగాణ ప్రజల కర్మ… గద్దర్ గురించి మాట్లాడే స్థాయి అర్హత లేని బండి సంజయ్.. బేషరతుగా గద్దర్ కు , తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని.మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
