టేకుమట్ల, జనవరి 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య తండ్రి బండారి రాజయ్య వారం రోజుల క్రితం మృతిచెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర బిజెపి నాయకుడు కాసర్ల అరవింద రెడ్డి , బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దుగ్యాల రామచంద్రరావు మృతుని ఇంటికి వెళ్లి మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మృతికి గల కారణాలు తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులు ఎవరు అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. మృతుని కుటుంబానికి బిజెపి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దేశెట్టి సునీల్ బిజెపి పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
