
అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఘనంగా శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
కరీంనగర్: అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు బుధవారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి గణపతి మండపంలో పర్యావరణహిత మట్టి గణపతులను ప్రతిష్టించి మొదటి రోజు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుని పూజ చేయడం వలన శుభఫలాలు కలుగుతాయని, అడ్డంకులు తొలగిపోతాయని, విజయాలు లభిస్తాయని తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల నడుమ జరుపుకోవడం విశేషమని పేర్కొన్నారు.
ప్రతిఒక్కరూ పర్యావరణహిత గణపతులను ప్రతిష్టించి వనరుల సంరక్షణకు ముందంజలో ఉండాలని కోరారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు వివిధ రకాల పూజలతో స్వామివారిని కొలుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
