జమ్మికుంట ఫిబ్రవరి 1: ఆల్ఫోర్స్ చైర్మన్ వి..నరేందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు శనివారం జమ్మికుంట లో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ డా ..నరేందర్ రెడ్డి ఉపాధ్యాయులుగా ఉండి అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యను అందిస్తూ ,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ లక్షాధి నిరుద్యోగ యువత ఉద్యోగాల్లో తన పాత్ర క్రియాశీలక మైనది .తను ఉపాధ్యాయుడిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతు ఆల్ఫోర్స్ సంస్థలను ప్రారంభించి కరీంనగర్ పేరును రెండు రాష్ట్రాలకు తెలియ జెసిన నరేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతే కాకుండా వేలాది నిరుపేదల విద్యార్థులకు ఉచిత విద్యను అందించి, వాళ్ళ బ్రతుకులో వెలుగులు నింపారు.అంతే కాకుండా 55 ఆల్ఫోర్స్ సంస్థలు నిర్మించి,పది వేల ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చారు..అంతేకాకుండా ఎన్నో స్వచ్చంద సంస్థలకు తన వంతు సహాయం చేసి ప్రజల గుండెల్లో ఇట్లాంటి వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించినందుకు మల్లికార్జున ఖార్గే కి,రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి కి,మహేష్ కుమార్ గౌడ్ కి, పొన్నం ప్రభాకర్ కి, బల్మూరీ వెంకట్ కి కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ సన్నీ , సీనియర్ ఎన్ఎస్యుఐ నాయకులు జియఉల్ అలీ, అజమాద,సోహల్, సమీర్ ,నరేష్,రాజేష్,బబ్బులు, మహేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.
