▪️ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక చర్యలు
▪️ శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజీ, హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు
కరీంనగర్, 25 మార్చి 2025: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి విప్లవాత్మక చర్యలు చేపడుతున్నారని, ఈ చర్యలతో కరీంనగర్ రాబోయే రోజుల్లో ఎడ్యుకేషనల్ హబ్‌గా మారనుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా కాలేజీ, హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కృషిని కొనియాడారు.
🔹కరీంనగర్లో విద్యా రంగం కొత్త దశలోకి
🔹శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ మంజూరు
🔹హుస్నాబాద్‌లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
🔹ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (CSE, AI, IT, ECE) బ్రాంచులు
🔹కాలేజీ నిర్మాణానికి రూ. 44.12 కోట్లు కేటాయింపు, మొదటి దశగా రూ. 29.12 కోట్లు విడుదల
🔹లా కాలేజీకి రూ. 22.96 కోట్లు మంజూరు, మొదటి విడతగా రూ. 5 కోట్లు విడుదల
🔹మొత్తం రూ. 67.08 కోట్ల నిధులు విద్యా అభివృద్ధికి కేటాయింపు
రాష్ట్రంలో విద్యా విప్లవం
🔸58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రూ. 11,600 కోట్లు
🔸ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక రెసిడెన్షియల్ స్కూల్
🔸హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ
🔸విద్యా రంగానికి రూ. 23,108 కోట్లు బడ్జెట్లో కేటాయింపు
బీఆర్ఎస్ హయాంలో విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. గత పాలకులు కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహించారని, కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే మెడికల్ కాలేజీ మంజూరు చేశారని అన్నారు.
ఇంజినీరింగ్, లా కాలేజీలతో పాటు మెడికల్ కాలేజీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌ను విద్యా హబ్‌గా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు అని వెలిచాల రాజేందర్ రావు అన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
