ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుక నవుతానని,
కరీంనగర్, ఆదిలాబాద్ , నిజామాబాద్ , మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి మల్క కొంరయ్య అన్నారు. సోమవారం రోజున కరీంనగర్ పట్టణం లో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు.
అనంతరం ఎస్ బి ఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు.
గత బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వాలుగా మారాయన్నారు . ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో రెండు ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు కేవలం జీతాలు పొందుతున్నారే తప్ప ఏ సౌకర్యాలు పొందడం లేదన్నారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చెందుతున్న ఉపాధ్యాయులకు పెన్షన్, గ్రాట్యూటి, జిపిఎఫ్, సరెండర్ లీవ్ డబ్బులు, పిఆర్ సి ఇచ్చే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. బి ఆర్ఎస్ , కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఏనాడు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల కోసం కొట్లాడింది లేదు, శాసనమండలిలో మాట్లాడింది లేదన్నారు. ఆ రెండు పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చినందున జరగబోయే ఎన్నికల్లోబిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న
తనకు అవకాశం కల్పించాలని కోరారు.. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు
ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షులు అనంతరావు, ప్రధాన కార్యదర్శి సురేష్, నాయకులు పోలి సత్యనారాయణ నరేంద్ర రావు కృష్ణవేణి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, అభిమానులు పాల్గొన్నారు.
