ఇల్లందకుంటలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు పోలీసుల హెచ్చరిక

ఇల్లందకుంట మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ క్రాంతి కుమార్ సూచించారు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని, పాత గోడల సమీపంలో ఉండకుండా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఇంటి వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, సీజనల్ వ్యాధులు వస్తాయన్నారు. పిల్లలు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని, వర్షం సమయంలో చెట్ల కింద ఉండకూడదన్నారు.
రైతులు బావుల దగ్గర కరెంట్ పనులు చేయరాదని, విద్యుత్ సంబంధిత వస్తువులను తాకవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కుంటలలో చేపలు పట్టేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
