అంబేద్కర్ కాలనీలో వైద్య శిబిరం

జమ్మికుంట, జూలై 24 (జిందగీ 9 న్యూస్):
వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ మహోన్నత పటేల్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో 54 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.
జ్వర లక్షణాలతో బాధపడుతున్న నలుగురి రక్త నమూనాలను ల్యాబ్‌కి పంపించారు. శిబిరంలో రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రామక వ్యాధులపై పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించారు.
హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, కాలనీవాసులకు మలేరియా, డెంగీ, చికన్ గున్య వంటి సీజనల్ వ్యాధుల లక్షణాలు, వ్యాప్తి తీరుపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతోపాటు డ్రై డే పాటించాల్సిన అవసరం, దోమల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు రత్నకుమారి, అరుణ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎంలు మంజుల, రజిత, ఆశా కార్యకర్తలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
