పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యవారిపల్లి ప్రీమియర్ లీగ్ (APL -1) క్రికెట్ టోర్నమెంట్ శనివారం ఘనంగా ముగిసింది. గ్రామ యువత క్రికెట్కు ప్రోత్సాహం అందిస్తూ అద్భుతంగా ఈ టోర్నమెంట్ను నిర్వహించింది.
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టోర్నమెంట్ విజేత జట్టుకు మొదటి బహుమతిగా రూ.20,000/- అందజేశారు. రెండవ బహుమతిగా రూ.15,000/-ను గౌని బుచ్చారెడ్డి, గౌని కోదండరాం రెడ్డి చేతులమీదుగా జట్టుకు అందించారు.
ఈ కార్యక్రమంలో గౌని జశ్వంత్ రెడ్డి, గౌని ఓం ప్రకాష్ రెడ్డి, గ్రామ ప్రముఖులు మద్దిలేటి, గుణ సాగర్, కురుమూర్తి, మజీద్, ఆరిఫ్ పాల్గొన్నారు. అలాగే టోర్నమెంట్ ఆర్గనైజర్లు, క్రీడాకారులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు.
