కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన బీజేపీ నేత అంజిరెడ్డి బుధవారం శ్రీ మహాశక్తి దేవాలయానికి వెళ్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అమ్మవార్ల దయతో ఈ విజయం సాధించాను. కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటాను” అని అన్నారు.
అంజిరెడ్డి తన విజయం కోసం కృషి చేసిన బీజేపీ శ్రేణులకు, కార్యకర్తలకు, పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని, శాసన మండలిలో వారి గొంతుకగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్, బండ రమణారెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
