హైదరాబాద్, ఫిబ్రవరి 04: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన గట్టు లక్ష్మీ వైద్య చికిత్స కోసం రూ.1,00,000 LOC మంజూరు చేయించారు.
కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న గట్టు లక్ష్మీ కుటుంబం CMRF (Chief Minister’s Relief Fund) ద్వారా సహాయం అందించాలంటూ మంత్రివర్యులకు విజ్ఞప్తి చేయగా, వెంటనే స్పందించిన శ్రీధర్ బాబు , రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు.
ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సహాయకులు గట్టు లక్ష్మీ కుటుంబానికి LOC (Letter of Credit) అందజేశారు. మంత్రివర్యుల సత్వర స్పందనకు గట్టు లక్ష్మీ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, శ్రీధర్ బాబు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
“దుద్దిళ్ల హస్తం – పేదల నేస్తం” అంటూ మంథని నియోజకవర్గ ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
— Zindagi9News
