యాడికి మండలంలోని మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారు గురువారం అనాధ మహిళకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె గ్రామంలో ఇంటింటికి తిరిగి బిక్షమెత్తుకొని జీవిస్తున్న మహిళ ఊరి బయట బండల కోసం తీసిన గనుల గుంతలలో ప్రమాదవశాత్తు పడి బుధవారం మరణించడం జరిగింది. గురువారం ఉదయం గమనించిన స్థానికులు ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. బందార్లపల్లె వీఆర్వో రవితేజ యాడికిలోని మే హెల్ప్ యు ఫౌండేషన్ మరియు వేడుకపుర ఫౌండేషన్ సభ్యులకు అంత్యక్రియలు చేయవలసిందిగా కోరడం జరిగింది. విషయం తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యులు యాడికి నుంచి బందార్ల పల్లె గ్రామానికి వెళ్లి మృతురాలికి అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విఆర్వో రవితేజ,ఎ.ఎస్.ఐ గోవింద నాయక్ , సచివాలయ సిబ్బంది, యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు చందగాని ద్రువ నారాయణ, సభ్యులు బడిగించల వేణు, సాయివరపు నాగరాజు, టి లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

