
⚡ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రూ.30 వేల లంచం – ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీరు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లోని హిమాయత్‌సాగర్ సెక్షన్ పరిధిలో అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది. ఎ.ఆర్.సి.కె. ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్లో కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి ఫిర్యాదుదారుని నుండి రూ.30,000 లంచం తీసుకుంటూ సహాయక ఇంజనీరు అమర్ సింగ్ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల చేతికి చిక్కాడు.గంధంగూడ సబ్‌స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా, ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
