సైకాలజిస్ట్‌ల సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు.. శనివారం నగరంలోని ఆల్ఫోర్స్ టైనీ టాట్స్ లో టీపీఏ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీలు, క్యాలెండర్ లు ఆవిష్కరించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యాసంస్థకు సైకాలజిస్ట్‌ల అవసరం ఉందని అన్నారు. సైకాలజిస్ట్‌ల అవసరం మేరకు కౌన్సిల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అన్నారు.. సైకాలజిస్ట్ సేవలు ఎంతో అమూల్యమైనవని వాటిని అవసరమైన వారు వినియోగించుకొని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.. రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామచందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1400 మంది సైకాలజిస్ట్‌లు ఉన్నారని వీరి అవసరాలను గుర్తించి వెంటనే కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు.. తమ సంస్థ ద్వారా వేలాదిమందికి ఉచిత కౌన్సిలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.. ప్రతి జిల్లాలో తమ కమిటీలు ఉన్నాయని వాటి ద్వారా ప్రజలకు అన్ని విధాలుగా మానసిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని అన్నారు.. కార్యక్రమంలో కార్యక్రమంలో కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం అధ్యక్షత వహించగా సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు డాక్టర్ వై ఆంజనేయులు, మ్యాజిక్ రాజా, అలవాల ఈశ్వర్, సైకాలజిస్ట్‌లు మెతుకు సత్యం, అనురాధ, ప్రణయ్ మీసాల లలిత, రాధిక శ్రీనివాస్, అనిత తదితరులు పాల్గొన్నారు.

