సిద్దిపేట ప్రెస్ భవన్లో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కుట్రలు పన్ని తనను ఎన్నికల నుంచి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని ప్రచారం చేయడం దారుణమని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బు కట్టలతో టికెట్లు తెచ్చుకుంటున్నారని ఆరోపించిన ఆయన, పట్టభద్రుల ఓటరు వివరాలు అనధికార వెబ్సైట్లో లీక్ అయ్యాయని పేర్కొన్నారు. దీనిపై భారత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామని తెలిపారు.
“ప్రజాసేవకుడిగా ఎల్లప్పుడూ ప్రజలతో ఉన్నా. నా పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేసిన ఆయన, బ్యాలెట్ నెంబర్ 11 కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు.
