శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం
శివ భక్తుల నుండి ఆలయ నిర్మాణానికి ఉత్సాహభరిత స్పందన

పెబ్బేర్, జూలై 10(zindagi9news):
పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కోసం శివభక్తుల నుండి విరాళాలు అందుతున్నాయి. ఇందులో భాగంగా పెబ్బేర్కు చెందిన శ్రీ వెంకటేశ్వర బార్ & రెస్టారెంట్ సభ్యులు ఆదివారం రోజున ఆలయ కమిటీకి ఒక్క లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు.
విరాళం అందజేసిన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్పందిస్తూ, “వీరికి, వారి కుటుంబ సభ్యులపై స్వామి రామలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర బార్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, శివభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెబ్బేర్ పరిధిలో శివార్చనకు ప్రాధాన్యతను చాటుతూ భక్తుల సహకారంతో ఆలయం నిర్మాణం వేగంగా పూర్తవుతుందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో భక్తులందరికీ ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
