
కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మార్గమధ్యంలో బావూపేట వద్ద రహదారి పై మోకాళ్ల లోతు నీళ్లు కనిపించి ఆరా తీశారు. స్థానికుల వాపోను విని వెంటనే ఆర్ అండ్ బి అధికారులకు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ప్రయాణికుల అవస్థలపై సీరియస్ అయిన మంత్రి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు.

