
మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తృతీయ వర్ధంతి ఘనంగా నిర్వహణ
కరీంనగర్: మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు వెలిచాల జగపతిరావు తృతీయ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు యువసేన ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, సన్నిహితులు జగపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పేదల ఆత్మబంధువుగా పేరుపొందారని వారు పేర్కొన్నారు.
జగపతిరావు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులోనూ విశేష కృషి చేశారని వారు గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పనిచేసినప్పుడు ప్రజల పక్షాన నిలబడి సేవలందించారని తెలిపారు.
పేదల సమస్యలను తనవిగా భావించి వారికి అండగా నిలిచిన జగపతిరావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని నాయకులు అన్నారు. కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మోడల్‌గా తీర్చిదిద్దిన నాయకుడు జగపతిరావు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వెలిచాల రాజేందర్ రావు యువసేన ప్రతినిధులు, వెలిచాల ప్రజా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
