
జమ్మికుంట, జూన్ 27 (జిందగీ 9 న్యూస్):జమ్మికుంట పట్టణంలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు, బుక్ స్టాల్ యజమాన్యుల మధ్య అసహజ ఒప్పందాలు జరుగుతున్నాయంటూ ఏఐఎఫ్డీఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చాలా ప్రైవేట్ పాఠశాలలు బుక్ స్టాల్ యజమానులతో చేతులు కలిపి తల్లిదండ్రులను నిర్బంధితులుగా తయారు చేస్తున్నాయి. తక్కువ ధరలో లభించే పుస్తకాలను అధిక ధరకు కొనాలని బలవంతం చేస్తున్నాయి. పాఠశాల యాజమాన్యాలు తమకు అనుకూలమైన బుక్ స్టాల్స్ వద్దకు తల్లిదండ్రులను పంపిస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం” అని మండిపడ్డారు.
అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సంబంధిత పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేగాక, ఈ బుక్ స్టాల్స్ ను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మండల విద్యాధికారిని ఆయన కోరారు.
2025–26 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ ఇష్టారాజ్యం ఆపాల్సిన అవసరం ఉందని గడ్డం శ్రీకాంత్ స్పష్టం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
