సమగ్ర ఆరోగ్య శిబిరం నిర్వహణ
ప్రతి ఒక్కరూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి – డాక్టర్ సుధా రాజేంద్ర
అడిషనల్ డిఎంహెచ్ఓ, కరీంనగర్

జమ్మికుంట : కొత్తపల్లి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంప్‌లో హెచ్ఐవి, హెపటైటిస్ బి వంటి వైరస్లు, బిపి, షుగర్, టిబి, మలేరియా, డెంగ్యూ వంటి అనేక వ్యాధులపై పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో భాగంగా అవసరమైన మందులు పంపిణీ చేశారు.
ఈ శిబిరాన్ని అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సుధా రాజేంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
“ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హెచ్ఐవి, హెపటైటిస్ బి, షుగర్, టిబి వంటి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి” అని సూచించారు. వర్షాకాలంలో ప్రబలే మలేరియా, డెంగ్యూ, చికన్‌గునియా వంటి వ్యాధుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని చెప్పారు. డ్రై డే స్పెషాలిటీ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వావిలాల పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాజేష్, ఎంఎల్ఎహెచ్పీ డాక్టర్ బిందు, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్లు అరుణ, దేవేందర్ రెడ్డి, ఐసిటిసి కౌన్సిలర్ మహిపాల్, ల్యాబ్ టెక్నీషియన్ ఇబ్రహీం, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎం వాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
